నల్గొండ జిల్లా నందికొండలో హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖాన సిబ్బందిని సామాజిక కార్యకర్త, తెరాస నాయకులు సన్మానించారు. శాలువాలతో సత్కరించారు.
కరోనా కట్టడిలో ఆస్పపత్రి సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని సూపరింటెండెంట్ భాను ప్రసాద్ తెలిపారు. మిర్యాలగూడ, నల్గొండలో దవాఖానలో ఆక్సిజన్ బెడ్స్ లేని కారణంగా రోగులు సాగర్ ఆస్పత్రికి రిఫర్ చేసే అవకాశం ఉన్నందున మరో 40 ఆక్సిజన్ బెడ్స్, 30 జనరల్ బెడ్స్‌ను సిద్ధం చేశామని తెలిపారు.
ఇదీ చదవండి: కరోనాను ఎదుర్కోవటంలో మాస్కులే శ్రీరామ రక్ష