ETV Bharat / state

father and son win: అంతర్జాతీయ ఛాంపియన్​షిప్​ పోటీల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు

నేపాల్​లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఛాంపియన్​షిప్​ పోటీల్లో(Nepal International championship 2021) తెలంగాణకు చెందిన తండ్రీకొడుకులు(father and son win) సత్తా చాటారు. నల్గొండ జిల్లాకు చెందిన మేకల అభినవ్ రెడ్డి అండర్-17 విభాగంలోని బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం సాధించగా... అతని తండ్రి భాస్కర్ రెడ్డి అండర్-45 విభాగంలోని 10 కే పరుగు పందెంలో రజత పతకం సాధించారు.

Nepal International championship
Nepal International championship
author img

By

Published : Nov 25, 2021, 12:47 PM IST

నేపాల్​లోని ఫోఖ్రా పట్టణంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఛాంపియన్ ​షిప్​ పోటీల్లో (Pokhara International championship news) తెలంగాణకు చెందిన తండ్రీకొడుకులు సత్తాచాటారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వద్దిరెడ్డి గూడెంకు చెందిన మేకల అభినవ్ రెడ్డి అండర్-17 విభాగంలోని బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం సాధించారు. అతని తండ్రి భాస్కర్ రెడ్డి అండర్-45 విభాగంలోని 10 కే పరుగు పందెంలో రజత పతకం గెలుపొందారు. అంతర్జాతీయ ఛాంపియన్​షిప్​-2021 (Nepal International championship latest news) పోటీలను భారత్, నేపాల్, శ్రీలంక సంయుక్తంగా ఈ నెల 20 నుండి 25 వరకు నిర్వహిస్తున్నారు.

Pokhara International championship
అంతర్జాతీయ ఛాంపియన్​షిప్​ పోటీల్లో సత్తా చాటిన నల్గొండ వాసులు

అభినవ్ రెడ్డి తండ్రి క్రీడాకారుడు కావడంతో కుమారునికి శిక్షణ ఇవ్వగా... ఆయన కూడా క్రీడల్లో పాల్గొని దేశానికి పేరు తెచ్చారు. అంతర్జాతీయ ఛాంపియన్​షిప్​ పోటీల్లో ఇద్దరం గెలవడం సంతోషంగా ఉందని భాస్కర్ రెడ్డి తెలిపారు. శ్రీలంకలో డిసెంబర్ 10 నుంచి జరిగే అంతర్జాతీయ పోటీలతో పాటు... వచ్చే ఏడాది జనవరి 10 నుండి దుబాయిలో జరిగే పోటీల్లో సైతం పాల్గోనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ధోనీ అభిమానులకు గుడ్​న్యూస్.. మరో మూడేళ్లు సీఎస్కేతోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.