నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువలో ఆదివారం తండ్రీ కొడుకులు గల్లంతయ్యారు. చిట్యాల మండలం వట్టిపర్తి గ్రామానికి చెందిన కప్పల లింగయ్య, కుమారుడు మణికాంత్ గురుకుల ప్రవేశ పరీక్ష నిమిత్తం ద్విచక్రవాహనంపై దామరచర్ల మండలంలోని పరీక్ష కేంద్రానికి వెళ్లారు.
కాలువలో స్నానం చేద్దామని దిగి...
పరీక్ష రాసి తిరుగు ప్రయాణమయ్యారు. వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువ వద్ద స్నానం చేసేందుకు నీటిలో దిగారు. కాలువ గట్టుపై ఫొటోలు దిగిన మణికాంత్, తల్లికి ఫొటోలు వాట్సాప్ చేశాడు.
కొడుకును కాపాడబోయి తండ్రి..
కాలువలోకి దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. కుమారుడిని కాపాడే యత్నంలో తండ్రి లింగయ్య గల్లంతయ్యారు. ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోక సంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చూడండి : నేడు రైతుల పిటిషన్పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు