కొవిడ్ బాధితులకు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అండగా నిలుస్తున్నారు. ఈ ఆపత్కాలంలో తన నియోజకవర్గంలోని కరోనా బాధితులకు మనోధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా తన సొంత ఖర్చుతో రోగనిరోధన శక్తినిపెంచే 17రకాల వస్తువులతో కరోనా నివారణ కిట్లు అందిస్తున్నారు.
మంగళవారం చిట్యాల మండలంలోని నేరడ గ్రామంలో పర్యటించిన ఆయన.. కరోనా బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించారు. తాను ఏర్పాటు చేసిన ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ తరపున కరోనా నివారణ కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు దుబ్బాక జగ్జీవన్రెడ్డి, లోడంగి సత్యం యాదవ్, ఉప సర్పంచ్ వడ్డగాని నర్సింహగౌడ్, సముద్రాల శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించిన ప్రభుత్వం