నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకోండ్లలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ ప్లాంటు కార్మికులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని గత 24 గంటల నుంచి టవరెక్కి నిరసన తెలిపారు. వేతనాలు కాంట్రాక్టర్ నుంచి కాకుండా నేరుగా బోర్డు ద్వారానే చెల్లించాలని డిమాండ్ చేశారు. బోర్డు అధికారులు కార్మికులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: కాల్వలోకి కారు... ఇద్దరు మహిళలతోపాటు కడుపులో శిశువు మృతి