నల్గొండ జిల్లా హాలియాలో లాక్డౌన్ అమలు తీరును డీఐజీ ఏవీ.రంగనాథ్ పరిశీలించారు. లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో కాకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించాారు.
నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించాలని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ప్రధాన రహదారులు కాకుండా గల్లీల్లో తిరిగే వారి పట్ల శ్రద్ధ వహించాలని, చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న దుకాణాలు తెరిచే ఉంటున్నాయని చెప్పారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు అందరూ సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: Viral: చలానా తప్పించుకునేందుకు.. మహిళ పూనకం!