తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడిన ఉపాధ్యాయులే... పదోన్నతులు లేక ఇప్పుడు ఎక్కువ శాతం నష్టపోయారని... పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటానికి నేడు రోడ్డుపైకి వచ్చామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని నల్గొండ పట్టణంలో సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
45శాతం ఫిట్మెంట్తో కూడిన పిఆర్సీ, న్యాయబద్ధంగా రావాల్సిన పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. పదోన్నతులు లేక ఉపాధ్యాయులు, దాని కారణంగా విద్యార్థులు కూడా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చారని... కేవలం ఉపాధ్యాయులకే పెండింగ్లో పెట్టారని తెలిపారు. దీని వల్ల విద్యా వ్యవస్థకు నష్టం కలుగుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: కొత్త పార్టీలు వస్తుంటాయ్.. పోతుంటాయ్: షబ్బీర్ అలీ