కరోనా వైరస్ పట్ల అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా ఉల్లంఘించి పాఠశాలలు తెరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో భిక్షపతి హెచ్చరించారు.
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు హాల్‌టికెట్‌లు తీసుకుని నేరుగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. వసతి గృహాల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు మినహా ఎవరూ ఉండకూడదని స్పష్టం చేశారు. పాఠశాలలకు సెలవులపై ఎంఈవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశామని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.