ETV Bharat / state

Paddy procure: తుది దశ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. అన్నదాతల ఆందోళన - nalgonda farmers problems

తుది దశలో ఉన్న ధాన్యం కొనుగోళ్లు... రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా కల్లాల్లో ఉన్నది కొంచెమే అయినా... ఆ సరకును అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తేమ శాతం లేకపోవడం, ముందస్తు వర్షాలు, లాక్​డౌన్, లారీల కొరత, గన్నీ సంచుల లేమితో... అన్నదాతలు నెల రోజుల పాటు కల్లాల వద్దే నిరీక్షించాల్సి వస్తోంది.

Delay in final stage grain purchases at nalgonda district
తుది దశ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
author img

By

Published : Jun 6, 2021, 1:45 PM IST

కల్లాల వద్ద నిరీక్షిస్తున్న రైతులు... నిలువుదోపిడీకి గురవుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అన్ లోడింగ్ కావట్లేదంటూ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. లేదంటే లారీలు రావు అంటూ గట్టిగా చెబుతున్నారు. నాంపల్లి, చండూరు, నూతనకల్ కొనుగోలు కేంద్రాల్లో నెల రోజుల నుంచి అన్నదాతలు వేచిచూస్తున్నారు. అధికారికంగా కూలీల కోసం క్వింటాలుకు రైతుల నుంచి 3- 4 రూపాయలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు లారీలు, కూలీలు అంటూ క్వింటాలుకు కొన్ని చోట్ల 5 రూపాయలు వరకు... మరికొన్ని చోట్ల అంతకన్నా ఎక్కువగానే వసూలు చేస్తున్నారు.

ఒక్కో రైతు నుంచి బస్తాకు 3 వసూలు చేయడంతోపాటు... 40 కిలోల సంచికి గానూ సంచి బరువుతో కలిపి 40 కిలోల 700 గ్రాములు తీసుకోవాలి. కానీ 42 కిలోలు తూకం వేస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు 2 కిలోల దోపిడీ జరిగితే... మిల్లరు పేరు మీద మరో 3 కిలోలు తరుగు తీస్తున్నారు. మొత్తంగా అన్నదాతలు క్వింటాలుకు 5 కిలోల వడ్లు, 12.50 రూపాయలు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇలా క్వింటాలుకు ఒక్కో వ్యక్తి 50 రూపాయలు ఇవ్వడంతోపాటు అదనంగా మరింత ముట్టజెప్పాల్సి వస్తోంది.

మిగతా జిల్లాల నుంచి కూడా సేకరణ

7 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా వేస్తే 7.5 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని నల్గొండ యంత్రాంగం కొనుగోలు చేసింది. ఇంకో 20 వేల మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 110 మిల్లులు సామర్థ్యానికి మించి తీసుకున్నాయి. అయినా ఇతర జిల్లాల నుంచి నల్గొండకు ధాన్యాన్ని కేటాయించారు. వనపర్తి, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి నుంచి వచ్చే ధాన్యం తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఇప్పటికే సామర్థ్యానికి మించి కొని అవస్థలు పడుతున్న సమయంలో... మిగతా జిల్లాల నుంచి తీసుకునే సరకు ఎలా సర్దుబాటు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకాలం నయానో, భయానో తీసుకున్న మిల్లర్లను ఒప్పిస్తూ ఇతర జిల్లాల ధాన్యాన్ని సర్దుబాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. పైన ఏం జరుగుతుందో తెలియని రైతులు మాత్రం... ధాన్యం కొంటారని నిరీక్షిస్తూనే ఉన్నారు.

గోదాముల్లో నిల్వ..

నల్గొండ జిల్లాలో అంచనాలకు మించి ధాన్యం కొనుగోళ్లు జరగ్గా... సూర్యాపేట జిల్లాలో అంచనాల మేరకే వస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మూడు జిల్లాల్లోనూ చివరి దశ తరలింపులోనే ఇబ్బంది నెలకొంటోంది. మిల్లులు గరిష్ఠ స్థాయికి మించిపోయి ఖాళీ లేకపోవడంతో... అన్ని ప్రాంతాల్లో ఇబ్బంది తలెత్తుతోంది. తగిన తేమ శాతం లేదని కొంతకాలం... లారీలు రావట్లేదన్న సాకుతో మరికొన్ని రోజులు కొనుగోళ్లు నిలిపివేస్తున్నారు. ఇక వర్షాల వల్ల కుప్పలు, బస్తాలు తడిసి రైతులు లబోదిబోమంటున్నారు. చాలా చోట్ల ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. అయితే కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నాలుగైదు రోజుల్లోనే కొంటామని అధికారులు చెబుతున్నారు. మిల్లుల్లో ఖాళీ లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అధికారులు... ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేయిస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.