Cyber crime:అంతర్జాతీయ సైబర్ నేరాల దినోత్సవ నిర్వహణతో సాంకేతికంగా జరిగే నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని అంతర్జాతీయ సైబర్ నేరాల విశ్లేషకుడు ఆదోని వెంకటరమణ రావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే సైబర్ నేరాలపై చర్చించడం ద్వారా నివారణ దిశగా చర్యలు తీసుకోవచ్చని... ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ఉపయోగంపై అవగాహన పెంచవచ్చని చెప్పారు.
పిల్లలు, యువతకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం వల్ల ముందస్తుగా గుర్తించి నివారించేందుకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా పిల్లల పాఠ్యపుస్తకాల్లోనూ సైబర్ నేరాల గురించి తెలుసుకునే విధంగా పాఠ్యాంశాన్నీ రూపొందిస్తే బాగుంటుందని సూచించారు. దీనివల్ల పిల్లలకూ సైబర్ నేరాలపై అవగాహన వస్తుందని వివరించారు.
ఇదీ చదవండి:God Roof Garden: మిద్దెపై సేంద్రీయ సాగు.. ఆరోగ్యప్రదాయిని ఈ ఉద్యానవనం