నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలోని పెద్ద చెరువులో మత్స్యకారుల వలకి ముసలి చిక్కింది. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా... మొసలిని స్వాధీనం చేసుకొని టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్లో వదిలేశారు. మత్స్యకారులు పెద్ద చెరువులో వల విసరగా చేపలతోపాటు మొసలి రావడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థుల సాయంతో బంధించి అటవీ అధికారులకు అప్పగించారు. టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి మొసలి చెరువులోకి వచ్చినట్లుగా గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చూడండి: 'నినాదాలు, ప్రసంగాలతో దేశాభివృద్ధి సాధ్యం కాదు'