Cows Die After Being Hit Private Travel Bus: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కెట్పల్లి రహదారిపై మంగళవారం (ఈరోజు) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న భారతి ట్రావెల్ బస్సు (నెంబర్ టిఎస్ 73 ఏఈ 2026) ఢీ కొనగా 14 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో ఆరు ఆవులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం కాసరాజుపల్లి గ్రామానికి చెందిన రామావత్ రాము, రామావత్ భిక్కన్ మరికొందరు కలిసి ఆవులు మేపుతూ ఉంటారు. వారు జీవాలమీదే జీవితాన్ని కోనసాగిస్తూ వస్తున్నారు. ఎక్కువ ఆవులు ఉండటంతో వీరికి మేత కొరత ఎదురైంది. ఈ మేరకు జీవాల కడుపు నింపడానికి ఊరురా తిప్పుతూ మేత ఉన్నచోట వాటిని మేపుతూ ఉంటారు. ఇలా వారి కుటుంబాన్ని పోషించడానికి జీవాలను పెంచుకుంటున్నారు.
ఇలా సాగుతున్న వారి జీవితంలో అనుకోకుండా విషాదం చోటు చేసుకుంది. ఎంతో అల్లారు ముందుగా తమ బ్రతుకుదెరువైనా ఆవులను పెంచుకుంటున్న వారికి నిరాశే మిగిలింది. ఇంతకీ ఏమైందంటే.. రోజువారిలాగే ఈరోజు కూడా ఆవులను మేపేందుకు సొంత గ్రామం నుంచి వేములపల్లి వైపు వచ్చారు. చీకటి పడడంతో రాత్రికి బుగ్గబావి గూడెం వద్ద బస చేశారు. అయితే ఈరోజు తెల్లవారుజామున ఆవులతో రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో 14 గోవులు అక్కడికక్కడే మృతి చెందాయి.
మరో 6 ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. ఒకొక్క ఆవు ధర రూ.50 వేలు వరకు ఉంటుందని, సుమారుగా రూ.9 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఊరురా తిప్పి వాటి కోసం కుటుంబానికి దూరంగా ఉంటూ.. పెంచిన ఆవులు తమకళ్ల ముందే చనిపోవడంతో వారి రోధనలు చూపరులను కలిసి వేశాయి. దీనికి సంబంధించి ప్రైవేట్ ట్రావెల్ యజమానిపై కఠిన చర్యలు తీసుకొవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
తమకు జరిగిన నష్టాన్ని చూసి కన్నీటి పర్యాంతమయ్యారు. వారిని ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఘటన స్థలికి చేరుకున్న వేములపల్లి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ పరారీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తేలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: