ETV Bharat / state

రక్త నిల్వల కేంద్రంపై కరోనా ప్రభావం

author img

By

Published : Jul 21, 2020, 6:38 PM IST

ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా.. ఎవరికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం వచ్చినా వెంటనే గుర్తొచ్చొది ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రక్త నిల్వ కేంద్రాలు. ఎప్పుడు వెళ్లినా క్షణాల్లోనే రక్తం దొరికేది. కానీ కరోనాతో పరిస్థితులు తలకిందులయ్యాయి. రక్త నిల్వల కేంద్రాల్లో కూడా ప్రస్తుతం దొరకని పరిస్థితి. వివిధ సొసైటీల ఆధ్వర్యాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి దాతల నుంచి సేకరించిన రక్తాన్ని వాటికే అప్పజెప్పేవారు. కరోనా ప్రభావంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతోపాటు, రక్తం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల దాతల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

రక్త నిల్వల కేంద్రంపై కరోనా ప్రభావం
రక్త నిల్వల కేంద్రంపై కరోనా ప్రభావం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజాగా కరోనా వైరస్‌ అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. దీని ప్రభావం రక్తనిధి కేంద్రాలపైనా పడింది. వైరస్‌ వ్యాప్తి తీవ్రం అవుతుండటం వల్ల జిల్లాలో రక్త సేకరణకు శిబిరాలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆయా కేంద్రాల్లో రక్తనిల్వలు తరిగిపోతున్నాయి. కొన్ని రకాల గ్రూపుల రక్త నిల్వలు లేకపోవడం వల్ల ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అత్యవసర సమయంలో ఆ గ్రూపుల రక్తం ఎలా ఇవ్వాలో తెలియక కేంద్రాల నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు.

* నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన శ్రీనివాస్‌కు కొంత కాలంగా డయాలసిస్‌ కేంద్రంలో రక్తశుద్ధి నిర్వహిస్తున్నారు. రక్తం అవసరం కావడం వల్ల రెండు రోజుల క్రితం రక్తనిధి కేంద్రానికి వెళ్లారు. సాధారణంగానే యూనిట్‌ సిబ్బంది కుటుంబ సభ్యులు ఇద్దరు రక్తం ఇస్తే ఒకటి శుద్ధిచేసిన పొట్లం ఇస్తామన్నారు. బాధితుడిది నెగిటివ్‌ గ్రూప్‌ కావడం వల్ల దాతల కోసం తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరికి పాజిటివ్‌ గ్రూపు ఉన్నవారు ముగ్గురు రక్తం ఇచ్చి ఒక నెగిటివ్‌ రక్తం పొట్లం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

తీవ్ర ఇబ్బందులు పడ్డాం

"ఇటీవల మా తాతయ్య అనారోగ్యానికి గురయ్యారు. రక్తం ఎక్కించాలని డాక్టర్‌ సూచించారు. ప్రభుత్వ రక్తనిధి కేంద్రాన్ని సంప్రదిస్తే మాకు కావాల్సిన గ్రూపు రక్తం లేదని చెప్పారు. ప్రైవేటు రక్తనిధి కేంద్రంలో డబ్బులు ఎక్కువ అడిగారు. తెలిసిన వారు ఎవరైనా రక్తం ఇస్తారని ఎంతో ప్రయత్నించాం. కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. చివరికి చేసేది లేక ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది".

- వినోద్‌, సూర్యాపేట

ప్రతి నెలా 600 యూనిట్లు అవసరం

జిల్లాలో ప్రభుత్వరంగంలో నల్గొండ, సూర్యాపేటలో మాత్రమే రెండు రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. మరొకటి రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎలాంటి కేంద్రం లేక పోవడం వల్ల బాధితులు హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో రెండు రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి అన్నింటిలో కేవలం 102 యూనిట్ల రక్తం, 210 యూనిట్ల ప్లాస్మా అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్‌, నెగిటివ్‌ గ్రూపులుగా రక్తాన్ని వర్గీకరించారు. నల్గొండ జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో ఏ నెగిటివ్‌, సూర్యాపేటలో ఏ, ఏబీ నెగిటివ్‌ బాధితులకు రక్తం అందుబాటులో లేదు. మిగిలిన గ్రూపుల పరిస్థితి కూడా అదే స్థాయిలో ఉంది. ప్లాస్మా నిల్వలు కూడా అరకొరగా ఉండటం వల్ల ఒకరు లేదా ఇద్దరు రక్తదానం చేస్తే తప్ప అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు రక్తం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలో ప్రతి నెలా ఆరు వందల యూనిట్ల రక్తం అవసరం పడుతుందని వైద్యాధికారులు అంచనా వేశారు. అందులో మాతాశిశు సంరక్షణ కేంద్రాల్లో ప్రసవాల కోసం వచ్చేవారికి ఎక్కువగా అవసరం ఉంటుంది. హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉన్న గర్భిణులు, ప్రసవ సమయంలో రక్తస్రావమయ్యే మహిళలకు రక్తం వినియోగిస్తున్నారు. తరువాత స్థానంలో తలసేమియా, మూత్రపిండాల వ్యాధిగ్రస్థులు ఉంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి రక్తం అవసరం ఉంటుంది.

శిబిరాలు నిర్వహించలేక..

జిల్లాలో ఏప్రిల్‌ 2న కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. ప్రస్తుతం వైరస్‌ కోరలు చాస్తోంది. గడిచిన వారం రోజుల్లో మూడు వందల మంది బాధితులు పాజిటివ్‌ బారిన పడ్డారు. దీంతో పాటు విద్యా సంస్థలు, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడినందున రక్తదాన శిబిరాలు నిర్వహించడానికి పరిస్థితి అనువుగా లేదని అధికారులు చెబుతున్నారు. గత నెలలో వైరస్‌ వ్యాప్తి కాస్త తక్కువగా ఉన్నందున నల్గొండ, సూర్యాపేట రక్తనిధి కేంద్రం ద్వారా కొంత మంది శిబిరాలు నిర్వహించినా పదుల సంఖ్యల యూనిట్లలోనే రక్త సేకరణ జరిగింది. సంబంధిత అధికారులు అన్నివర్గాల వారికి అవగాహన కల్పించి రక్తదాతలు స్వచ్ఛందంగా కేంద్రాలకు వచ్చి రక్తం ఇచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

స్పందించాల్సిన తరుణమిది

ఇలాంటి తరుణంలో దాతలు కేంద్రాలకు తరలి వచ్చి రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌ కారణంగా ఎక్కువశాతం విద్యార్థులు, యువత ఇళ్లకే పరిమితమవుతున్నారు. రక్తం అందుబాటులో ఉన్నప్పుడు దానం చేయడంలో కన్నా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదానం చేసే వారికి మంచి గుర్తింపు ఉంటుంది. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తోటి వ్యక్తుల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రక్తదానం చేయవచ్చు.

-డా. మాతృనాయక్‌, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి

ఇదీ చూడండి: 30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో రిజర్వాయర్​ నిర్మించాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.