ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య... ఏ మాత్రం తగ్గడం లేదు. మూడు జిల్లాల పరిధిలో 24 గంటల వ్యవధిలోనే 342 కేసులు నమోదైనట్లు... రాష్ట్ర వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో 174, సూర్యాపేటలో 108, యాదాద్రి భువనగిరి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి.
నాలుగు రోజుల్లోనే 1,234 కేసులు వెలుగుచూడగా... ఆసుపత్రులకు వస్తున్నవారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న దృష్ట్యా... ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.