నల్గొండ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య... అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 24 కేసులు నమోదవడం... పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నిన్న 17 కేసులు నిర్ధరణ కాగా... రెండు రోజుల వ్యవధిలోనే 41 కేసులు వెలుగుచూశాయి. వలస జాబితాలో చేరిన 10 మందితో కలిపి... మొత్తం కేసుల సంఖ్య 179కి చేరుకుంది. అత్యధికంగా మిర్యాలగూడలో 8, జిల్లా కేంద్రంలో 7 నమోదయ్యాయి.
ఇక మండలాల వారీగా చూస్తే... హాలియాలో 3, నిడమనూరులో 2, దేవరకొండ, గుడిపల్లి, శాలిగౌరారం, మునుగోడులో ఒక్కొక్కటి చొప్పున బయటపడ్డాయి. ఇక మరో 108 మంది నమూనాలు సేకరించి పంపిన అధికారులు.. 431 పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌తో కొత్తగా మరొకరు ప్రాణాలు కోల్పోగా... ఇప్పటివరకు మృత్యువాత పడిన వారి సంఖ్య ఆరుకు చేరింది. 143 మంది బాధితులు... ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి: వాస్తు పేరుతో ప్రజాధనం వృథా : రేవంత్‌రెడ్డి