ETV Bharat / state

Congress on munugodu: 'వారిద్దరి కుట్రలో భాగమే మునుగోడు ఉపఎన్నిక'

Congress on munugodu: కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భాజపా, తెరాస అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను 5నిమిషాల్లో స్పీకర్‌ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ దిల్లీ వెళ్లి రాగానే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వెంటనే ఆమోదించటం కుట్రలో భాగమేనని ఆరోపించారు.

Congress on munugodu
Congress on munugodu
author img

By

Published : Aug 11, 2022, 3:39 PM IST

Updated : Aug 11, 2022, 7:46 PM IST

Congress on munugodu: మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్‌ నేతలు దృష్టి సారించారు. ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న హస్తం పార్టీ గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగి.... నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో మరోసారి సమావేశం అయ్యారు. ఇందులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, జావిద్‌, చౌదరి పాల్గొన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్, దామోదర్‌రెడ్డి, మధుయాష్కీ కూడా హాజరయ్యారు. అభ్యర్థి ఎంపిక సహా వివిధ అంశాలపై సమాలోచనలు చేశారు. అనంతరం పీసీసీ అనుబంధ సంఘాల ఛైర్మన్ లతో ఠాగూర్ భేటీ అయ్యారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు.

తెరాస, భాజపాను ఢీకొట్టేందుకు సమాయత్తమవుతున్నామని ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ తెలిపారు. ఉపఎన్నికలో తమను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. భాజపా కుట్రలకు తెరాస సహకరిస్తోందన్నారు. అభ్యర్థి ఎంపికలో జిల్లా నాయకత్వాన్ని సంప్రదిస్తామని నిర్ణయాలను వారిపై రుద్దబోమని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా గెలుపు కాంగ్రెస్‌దేనని మధుయాష్కి ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడు బరిలో నిలిచేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల13 నుంచి నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించారు. పాదయాత్రతో ప్రారంభించి అమిత్‌ షా వచ్చే రోజున పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో తెరాస, భాజపా ఒక్కటేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒప్పందంతోనే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా ఐదు నిమిషాల్లో ఆమోదించారని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక తెరాసకు అవసరమైతే మునుగోడులో ఎన్నిక భాజపాకు అవసరముందన్నారు. ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

'వారిద్దరి కుట్రలో భాగమే మునుగోడు ఉపఎన్నిక'

ఆకస్మాత్తుగా మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చారు. భాజపా, తెరాస మధ్య అవగాహన ఒప్పందంతోనే ఉపఎన్నికకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎలక్షన్ కమిషన్ ప్రమేయం లేకుండా వీళ్లే ఉపఎన్నిక తేదీ ప్రకటిస్తారు. తెరాస, భాజపా కలిసి కాంగ్రెస్​ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. గత ఎన్నికలో పోలైన ఓట్లను కాపాడుకుంటే గెలుపు కాంగ్రెస్‌దే. తెరాస, భాజపా ఎన్ని కుట్రలు పన్నినా.. కార్యకర్తల బలంతో మళ్లీ మునుగోడును నిలబెట్టుకుంటాం. - మధుయాస్కీ, ప్రచార కమిటీ చైర్మన్

ఈ నెల 13వ తేదీన నారాయణపూర్‌ నుంచి చౌటుప్పల్‌ వరకు నిర్వహించే పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాస్కీ పాల్గొంటారని ఆ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఉప ఎన్నికల వేళ ఈ పాదయాత్ర తమకు కీలకమన్నారు. ఈ నెల16వ తేదీన నాంపల్లి, మర్రిగూడ మండలాలు, 18న చండూరు, మునుగోడు నాయకులతో భేటీ, 19 నారాయణపూర్‌, చౌటుప్పల్‌ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారని నల్గొండ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్ తెలిపారు. అమిత్ షా వచ్చే రోజున భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చెప్పారు. అదే రోజు 20 వేల మందితో సిలిండర్ల ప్రదర్శన చేస్తామన్నారు.

ఇవీ చదవండి: పాక్​ యువతిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు హైదరాబాదీ సాహసం.. రంగంలోకి దిగిన పోలీసులు

స్వీపర్లు, ప్యూన్​ల పిల్లలతో మోదీ రాఖీ వేడుకలు

Last Updated : Aug 11, 2022, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.