ETV Bharat / state

'సాగర్​లో తెరాస ఏం అభివృద్ధి చేసిందో చెప్పండి' - జానారెడ్డి తాజా వార్తలు

తెరాస గెలిచిన తర్వాత నాగార్జునసాగర్​ను ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

janareddy, utaam kumar reddy
జానారెడ్డి, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి
author img

By

Published : Apr 4, 2021, 5:01 PM IST

Updated : Apr 4, 2021, 5:13 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి పాల్గొన్నారు. తెరాస గెలిచిన తర్వాత నాగార్జునసాగర్​ను ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ ఆనకట్ట నీడన ఉండి జానారెడ్డి ఏం చేశాడని అంటున్నారని.. ఏం చేశారో ప్రజల్ని అడిగితే చెబుతారని అన్నారు.

సీఎం కేసీఆర్​కు కాళేశ్వరం, భగీరథ ద్వారా డబ్బు దోచుకోవడం.. ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయడం అవాటయిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ శ్రమించి జానారెడ్డిని గెలిపించుకోవాలి కోరారు. నాగార్జునసాగర్​లో మంచి నీటి సరఫరా, రోడ్లు తన హయాంలో వేసినవి తప్ప.. సీఎం కేసీఆర్ సాగర్​లో ఒక్క అభివృద్ధి పని చేయలేదని జానారెడ్డి అన్నారు. ఈ నెల 17న జరిగే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

జానారెడ్డి, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల్లో అందాల భామ పోటీ!

Last Updated : Apr 4, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.