నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి స్థిరపడ్డారని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధిని పెద్దవాళ్లను అడిగితే తెలుస్తుందని అని అన్నారు. తనతో పనిచేసిన వారు స్వలాభం కోసం విడిపోయారని అన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. నిడమనూరు మండలంలోని శాఖపురం, రాజన్న గూడెం, పార్వతీపురం, మర్లగడ్డ క్యాంప్, వెంగన్న గూడెం, ముకుందాపురం గ్రామాల్లో ప్రచారం చేశారు. గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటులో తాను ప్రముఖ పాత్ర పోషించానని గుర్తు చేశారు. తనను గెలిపిస్తే ప్రభుత్వంపై పోరాడతానని తెలిపారు.
ఇదీ చదవండి: ఠాణాలో పోలీసుల నాగిని డ్యాన్సులు