ETV Bharat / state

'జానారెడ్డి గెలుపు.. రాష్ట్ర రాజకీయాల్లో మలుపు' - nagarjuna sagar by election 2021

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జానారెడ్డి గెలిస్తే రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి హయాంలోనే సాగర్‌ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిందని తెలిపారు.

jana reddy, congress, nagarjuna sagar
జానారెడ్డి, నాగార్జునసాగర్ ఉపఎన్నిక
author img

By

Published : Mar 28, 2021, 6:51 AM IST

నాగార్జునసాగర్​ ఉపఎన్నికలో.. తెరాస నాయకులు డబ్బు సంచులతో ఊళ్లలోకి వచ్చి కాంగ్రెస్‌ నాయకులను కొంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు మాత్రం తెరాస వాళ్లు ఇచ్చిన డబ్బులు తీసుకొని కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా హాలియాలో శనివారం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జనగర్జన సభ నిర్వహించారు.

ప్రచారానికి దూరంగా ఉందాం.. సిద్ధమా కేసీఆర్‌?

సోనియాగాంధీ కేసీఆర్‌ను ఎన్నడూ నమ్మలేదని.. తనని నమ్మే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని జానారెడ్డి వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో మండలాల వ్యవస్థకు ఆద్యుడిని తానేనని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ఆదర్శ రాజకీయాలను నెలకొల్పుదాం. ఏ పార్టీ ఇక్కడ ప్రచారం చేయకూడదు. కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో కూర్చొని ప్రజలకు స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఇవ్వాలి. నేను గాంధీభవన్‌లో ఉంటా. ఈ సవాల్‌ను ముఖ్యమంత్రి స్వీకరిస్తే నేను సిద్ధమే’ అని జానారెడ్డి అన్నారు. నెల్లికల్‌ ఎత్తిపోతల పథకం కాంగ్రెస్‌ పార్టీకి బిడ్డ లాంటిదని, 2013లోనే ఈ పనిని ప్రారంభించాలని అనుకున్నా కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో జాప్యం జరిగిందన్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షి ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్‌, అప్పటి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అని తెలిపారు.

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో పంచాయతీరాజ్‌, రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలోని బీటీ రోడ్లు 963 కి.మీ.లు ఉన్నాయని మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ల నియోజకవర్గాల్లోనూ ఇన్ని రహదారులు లేవని అన్నారు. తానీ నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించానని, ఒక శాసనసభ స్థానంలో ఇన్ని ఎకరాలకు నీరు ఇచ్చిన ఘనత ఉమ్మడి రాష్ట్రంలోనూ లేదని వెల్లడించారు. 30వ తేదీన నామినేషన్‌ వేస్తున్నానన్నారు.

సాగర్‌లో కాంగ్రెస్‌ గెలుపు చారిత్రక అవసరమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి పదవిని ఇస్తామంటే తనకది వద్దని తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని సోనియాకు అప్పట్లో జానారెడ్డి చెప్పారని వి.హనుమంతరావు వివరించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన పోవాలంటే జానారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘బండి సంజయ్‌.. కేసీఆర్‌ను జైల్లో ఎప్పుడు పెట్టిస్తావ్‌? ముహూర్తం ఏమైనా చూడాలా’ అని ఎద్దేవా చేస్తూ ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రులు దామోదర్‌రెడ్డి, కొండా సురేఖ, చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, అంజన్‌కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.