నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తనిఖీ చేశారు. మర్రిగూడ మండలం ప్లోరోసిస్ ప్రాంతం కావడం వల్ల స్థానికంగా ప్రజలు కాళ్లు, చేతులు వంకరపోయి ఇరవై ఏళ్లకే 60 సంవత్సరాల వయసు వారిగా కనపడతారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో సుమారు 8 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు. అనంతరం సిబ్బంది పనితీరు గురించి స్థానికులను ఆడిగి తెలుసుకున్నారు. పని తీరుపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
నూతన ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
నల్గొండ జిల్లాలోని ప్లోరోసిస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఆసుపత్రిని జిల్లా పాలనాధికారి సందర్శించారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉండాలని.. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.