ETV Bharat / state

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. భారీ మొత్తంలో సీఎం రిలీఫ్​ ఫండ్​ నిధులు స్వాహా - నకిలీ డాక్యుమెంట్లతో సీఎం రిలీప్​ పండ్ స్వాహా

CMRF funds Fraud : సీఎం రిలీప్​ ఫండ్​ నిధులను దుర్వినియోగం చేస్తూ.. ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు భారీ మోసానికి తెర తీశాయి. ఏకంగా రూ.4.50 లక్షల నగదును స్వాహా చేశాయి. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

cmrf
cmrf
author img

By

Published : Apr 7, 2023, 7:32 PM IST

CMRF funds Fraud : పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్మును కొందరు అడ్డదారులు తొక్కి కాజేస్తున్నారు. ఆసుపత్రుల్లో నకిలీ బిల్లులు సృష్టించి.. వాటి ద్వారా వచ్చిన డబ్బును దోచుకుంటున్నారు. ఇలా ఏకంగా రూ.4.50 లక్షలు దోచుకున్నారు. ఈ విషయంపై సీఎం సహాయ నిధి కార్యాలయానికి చెందిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు మోసం బయటపడింది. ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన నల్గొండ, మిర్యాలగూడలలోని ప్రైవేట్​ ఆసుపత్రుల్లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీఎం సహాయ నిధి సొమ్మును అడ్డదారులలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై సచివాలయంలోని రెవెన్యూ శాఖ అధికారి నెల క్రితం సైఫాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైఫాబాద్​ పోలీసులు సదరు కేసును సీసీఎస్​కు బదిలీ చేసి.. పత్రాలను పరిశీలించారు. అందులో ఖమ్మంలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రితో పాటు, మిర్యాలగూడలోనూ మరో ప్రైవేట్​ ఆసుపత్రి నిర్వాహకులు అక్రమంగా డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించినట్లు తేలింది.

వారు రూ. 4.50 లక్షల విలువ చేసే నకిలీ బిల్లులను రూపొందించినట్లు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై పలు సెక్షన్స్​ కింద కేసును నమోదు చేశారు. అయితే మరికొంత మంది వ్యక్తులు ఈ తరహా మోసానికి పాల్పడి.. ఉండవచ్చని సీసీఎస్​ అధికారులు అనుమానిస్తున్నారు.

అసలు ఈ విషయం ఎలా బయటపడింది: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఓ మల్టీ ప్రైవేట్​ ఆసుపత్రిలో ముగ్గురు వ్యక్తులు వైద్యం చేయించుకున్నట్లు.. అందుకు గానూ సీఎం సహాయ నిధికి నకిలీ బిల్లులు సృష్టించి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సీఎంఆర్​ఎఫ్​ కార్యాలయం వారి ఒక్కొక్కరికీ రూ.1,50,000లు చొప్పున ముగ్గురికి రూ. 4.50 లక్షలు విడుదల చేశారు. ఈ బిల్లులపై అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీయగా.. మిర్యాలగూడ ఆసుపత్రి నిర్వాకం బయటపడింది.

ఆసుపత్రిపై లోతైన విచారణ చేసేందుకు సీసీఎస్​ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా ఆసుపత్రి యాజమాన్యం నాలుగేళ్లలో హాస్పిటల్​కు.. మూడు పేర్లు మార్చడం పట్ల సర్వత్రా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేరు మార్చినప్పుడల్లా అనుమానం రాకపోవడం, పేరు మార్పునకు దరఖాస్తు చేసుకోగానే జిల్లా అధికారులు అనుమతి ఇవ్వడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో సదరు ఆసుపత్రి నిర్వాహకులు నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేయడంతో విషయం బయటపడగా.. స్థానిక నేత సహాయంతో క్షేమంగా బయటపడినట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్. రవి తన సిబ్బందితో ఆసుపత్రిలో రోగులు చికిత్స పొందారా లేదా వారి బిల్లులు నకిలీవా వంటి వివరాలు తనిఖీలు చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలియజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.