ETV Bharat / state

భగత్‌ను ఆశీర్వదించిన సాగర్ ప్రజలకు ధన్యవాదాలు: సీఎం - సాగర్​ ఉప ఎన్నిక ఫలితాలు

CM KCR wishes
CM KCR THANKS TO NAGARJUNA SAGAR PEOPLE
author img

By

Published : May 2, 2021, 4:17 PM IST

Updated : May 2, 2021, 4:47 PM IST

16:16 May 02

భగత్‌ను ఆశీర్వదించిన సాగర్ ప్రజలకు ధన్యవాదాలు: సీఎం

     సాగర్​ ఉప ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పట్టం కట్టారని సీఎం కేసీఆర్​ అన్నారు. తెరాస అభ్యర్థి నోముల భగత్​ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తానని సీఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్​తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.  

    దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్ట్​ ఇరిగేషన్ పథకాలను శరవేగంగా పూర్తి చేసిన ప్రజలకు నీరందిస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. విజయం సాధించిన అభ్యర్థి నోముల భగత్​కు సీఎం కేసీఆర్​ అభినందనలు తెలిపారు. ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.  

ఇదీ చూడండి: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం

Last Updated : May 2, 2021, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.