నల్లగొండ జిల్లా డిండి మండలం తౌక్లాపూర్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటించారు. పొలంబాట-పోరుబాట కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల వెన్నెముక విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డుకుంటామన్నారు. రైతుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరించారు. రైతులకు కొత్తగా భూములు ఇవ్వకపోగా... గతంలో ఇచ్చినవి లాక్కుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు మనకే అన్న కేసీఆర్... నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో... పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. డిండి ప్రాజెక్టు పేరు మీద కోట్లు దోచుకుంటున్నారు కానీ... అసలు నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఉద్యోగాల భర్తీపై సీఎంకు చిత్తశుద్ధి లేదు: ఉత్తమ్