నల్గొండ జిల్లాలోని నిడమనూరులో నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జానారెడ్డికి శాసనసభ సభ్యత్వం కొత్త కాదని... దాని ద్వారా వచ్చే అధికారంపై ఆశ కూడా లేదని భట్టి అన్నారు. కేసీఆర్ చేతిలో రాష్ట్రం నలిగి పోతుందని... తెలంగాణను కాపాడాలనే ఆలోచనతోనే ఆయన పోటీ చేస్తున్నారని తెలిపారు. దీనికోసం ప్రతి ఓటరు సహకరించాలని కోరారు. ఓటుతో రాష్ట్రాన్ని కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ ఐదు లక్షల కోట్లకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు. మద్యం ద్వారా రూ.30 వేల కోట్ల ఆదాయాన్ని పొందుతూ... తాగండి, తూగండి అంటున్నాడని ఆరోపించారు. చట్టసభల్లోనే ఉద్యోగాలు ఇవ్వనని మాట్లాడిన వ్యక్తి, ఎన్నికల సమయంలో నిరుద్యోగులను మభ్య పెడుతున్నారని భట్టి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పాలంటే... జానారెడ్డికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: జానారెడ్డి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది: వీహెచ్