నల్గొండ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయానికి ఎదురుగా నూతనంగా నిర్మించిన ఇంటి పార్టీ కార్యాలయాన్ని ప్రముఖ రచయిత వేణు సంకోజుతో కలిసి ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రారంభించారు.
శాసన మండలిలో నిరుద్యోగుల, పట్టభద్రుల సమస్యలను తెలియజేయడానికి ఒక ఉద్యమ నాయకుడు అవసరమని సుధాకర్ పేర్కొన్నారు. ఈసారి జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు వివరించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొందని.. వేల కోట్లు కుమ్మరిస్తే గానీ ప్రజాప్రతినిధులు కాలేరని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచూడండి.. పంచాయతీలో అవినీతిపై దీక్ష.. భగ్నం చేసేందుకు పోలీసుల యత్నం