హైదరాబాద్ చంచల్‌గూడ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రతన్ సింగ్ హఠాన్మరణం చెందారు. ఉదయం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.రతన్ సింగ్ తన కుమారుడి వివాహ ఏర్పాట్ల కోసం సెలవులపై తన సొంతూరు మిర్యాలగూడకు వెళ్లారు. ఈ రోజు విధుల్లో చేరేందుకు సిద్ధమై ఇంటి నుంచి బయలుదేరే సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందాడని ఆయన కుటుంబసభ్యులు జైలు అధికారులకు సమాచారం అందించారు.
తన కుమారుడి వివాహం గత మే నెలలో జరుగాల్సి ఉండగా కరోనా విజృంభన నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో... జూలై 4వ తేదికి పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఈ పెళ్లి ఏర్పాట్ల కోసం సెలవు పెట్టి తన సొంతూరుకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో హఠాన్మరణం చెందారు.
రతన్ సింగ్ ఆకస్మిక మరణంతో జైలు సహచర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రిటైర్‌మెంట్ కావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇటీవల పదవీ విరమణ వయస్సును పెంచడంతో ఉద్యోగంలోనే కొనసాగుతున్నారని సహచర ఉద్యోగులు తెలిపారు.
ఇదీ చదవండి: Chennamaneni issue: చెన్నమనేని పౌరసత్వంపై.. తుది వాదనలకు సిద్ధం కావాలన్న హైకోర్టు