నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
మంగళవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా నల్గొండ పట్టణంలో పూర్తిగా గులాబీ తోరణాలతో నిండిపోయింది. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పల్లాపై నల్గొండ వన్‌టౌన్, టూ టౌన్ పోలీసులు 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఎటువంటి అనుమతులు లేకున్నా... మంగళవారం నామినేషన్ సందర్భంగా పట్టణంలో డీజే, ఫ్లెక్సీ, బ్యానర్లు, హోర్డింగులు పెట్టడంతోనే కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: గెలుపు బాధ్యత తెరాస ఎమ్మెల్యేలదే: కేటీఆర్