BRS Public Meeting at Munugode : పూటకో పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు ఉండవని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. ఆనాడు ఉపఎన్నికలో మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఉపఎన్నికల్లో చూపిన చైతన్యాన్ని.. మునుగోడు ప్రజలు మరోసారి చూపించాలని కోరారు. నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirwada Sabha)లో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు.
50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ పదేళ్లలో ఆ సమస్యను పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ పథకం(Mission Bhagiratha) ద్వారా ప్రతి ఇంటికీ నీళ్లు ఇచ్చి రూపుమాపామని గుర్తు చేశారు. డబ్బు మదంతో పనిచేసే వాళ్లకు బుద్ధి చెప్పాలని కోరారు. 24 గంటల కరెంటు ఇస్తున్నది.. ఎవరో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఆఖరికీ ప్రధాని రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేదన్నారు.
CM KCR Speech at Sircilla Public Meeting : 'ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'
CM KCR Election Campaign in Telangana : చివరికీ ఈ ఏడాదే అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో అప్పుడే కరెంటు కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఆనాడు ఎన్నికల్లో కాంగ్రెస్.. 20 గంటల కరెంటు ఇస్తామని అక్కడి ప్రజలను మోసం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఐదు గంటలే విద్యుత్ ఇస్తున్నారు. ఇవాళ కర్ణాటక రైతులు వచ్చి గద్వాల, కొడంగల్లో ధర్నాలు చేస్తున్నారన్నారు. బీజేపీ వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను తీసుకువచ్చి.. ఇక్కడ దించుతుంది.. అక్కడ వారికే దిక్కులేదు కానీ ఇక్కడకు వస్తున్నారని ఆరోపించారు.
"గతంలో ఉపఎన్నిక జరిగితే మీరంతా తీర్పు ఇచ్చారు. ఆ సందర్భంగా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఏఏ హామీలు ఇచ్చామో వాటన్నింటినీ నెరవేర్చడం జరిగింది. అంతకు ముందు కాంగ్రెస్ నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేదు. కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ సమస్యను పూర్తిగా తొలగించాము. ఆనాడు ఎక్కడకెక్కడో ఉన్నవాళ్లు.. నాడు వచ్చి నాకు సవాల్ విసురుతున్నారు. రాజకీయాల్లో డబ్బు మదంతో పని చేసేవాళ్లు ఉంటే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పాలి. భారతదేశంలో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ప్రధాని రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు." - కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు
CM KCR Praja Ashirwada Sabha at Munugode : తెలంగాణలో 3 కోట్ల టన్నుల వరి పండుతోందని సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే శివన్నగూడెం ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయని చెప్పారు. అదే జరిగితే మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ఈసారి ఎన్నికలో కూడా ఉపఎన్నికలో చూపిన చైతన్యాన్ని మునుగోడు ప్రజలు మరోసారి చూపించాలని కోరారు. చైతన్యవంతులైన నల్గొండ ప్రజలు ధన బేహార్లను తరిమి కొట్టాలని ఈ సందర్భంగా కోరారు.