నల్గొండ జిల్లా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో- ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 150 మందితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తలసేమియా రోగులకు, రక్తం అవసరం ఉన్న పేదలకు ఉపయోగపడేలా తమ వంతు బాధ్యతగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. గత సంవత్సరం 120 యూనిట్ల పైన రక్తాన్ని సేకరించడం జరిగిందని ఈరోజు 150 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ సంస్థకు150 యూనిట్ల రక్తాన్ని అందిస్తామని అన్నారు.
ఇదీ చదవండి: ఎల్‌ఆర్‌ఎస్ జీవో సవరించి విడుదల చేస్తాం : కేటీఆర్