ETV Bharat / state

పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన - formers

నల్గొండ జిల్లా పెదపూర మండలంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. అనంతరం ఊట్లపల్లిలో బత్తాయి తోటలను పరిశీలించిన బండి... రైతుల సమస్యలు అడిగి తెసులుకున్నారు.

BJP protest tomorrow in case of Pothireddipadu water
పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన
author img

By

Published : May 12, 2020, 2:56 PM IST

Updated : May 12, 2020, 4:01 PM IST

పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు నిరసనలు చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ పేర్కొన్నారు. రేపు ఇళ్ల నుంచే భాజపా శ్రేణుల నిరసనలు ప్రారంభిస్తారని తెలిపారు. నల్గొండ జిల్లా పెదపూర మండలంలో పర్యటించిన ఆయన...అనంతరం ఊట్లపల్లిలో బత్తాయి తోటలను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలో నిరసనలు చేపడుతామని స్పష్టం చేశారు. శ్రీశైలం నీటిని ఏపీకి తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. తెలుగురాష్ట్రాల సీఎంలు లోపాయికారి ఒప్పందంతో ప్రజల్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు. కొవిడ్ పరీక్షలు చేయకూడదని డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల్లో ఎక్కడా లేదని అన్నారు సంజయ్. రాష్ట్రానికి అపఖ్యాతి వస్తుందనే కొవిడ్ పరీక్షలు నిలిపివేశారని వివరించారు.

పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన

ఇదీ చదవండిః హైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

Last Updated : May 12, 2020, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.