నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అమరవీరుల స్థూపం వద్ద పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు భాజపా నాయకులు నిరసన చేపట్టారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు ఇవాళ మిర్యాలగూడలో ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా ట్రైబ్యునల్‌కు వ్యతిరేకంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అదనంగా నీటిని తరలించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కొత్తగా ఎత్తిపోతల పథకాలకు జీవో తీసుకు వచ్చిందని.. ప్రతిపక్షాలన్నీ ఆందోళన చెందుతున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వారు విమర్శించారు.
ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు