బత్తాయి సాగులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న నల్గొండ జిల్లా రైతులు ఇపుడు పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని స్థితిలో ఉన్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రం ఎస్ఎల్బీసీలో ఉన్న బత్తాయి మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. గత సంవత్సరం అధిక ధరలు పలికిన బత్తాయి.. ఈ సారి ధరలు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపి లేక రోగుల విలవిల