ETV Bharat / state

'కేంద్ర బలగాల పర్యవేక్షణలో మునుగోడు ఉపఎన్నిక జరపాలి' - నల్లు ఇంద్రాసేనా రెడ్డి తాజా వార్తలు

munugodu by election: డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి మునుగోడులో తెరాస గెలవాలని ప్రయత్నిస్తోందని భాజపా నాయకుడు నల్లు ఇంద్రాసేనా రెడ్డి ఆరోపించారు. బుద్దభవన్​లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన ఆయన మునుగోడులో.. స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగే విధంగా తగుచర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.

BJP leaders
BJP leaders
author img

By

Published : Oct 4, 2022, 6:06 PM IST

munugodu by election: కేంద్ర బలగాల పర్యవేక్షణలో మునుగోడు ఉపఎన్నిక జరపాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ను భాజపా ప్రతినిధుల బృందం కోరారు. ఈ మేరకు హైదరాబాద్​లోని బుద్దభవన్​లో వికాస్​రాజ్​ను కలిసిన వారు.. మునుగోడులో స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడాలని వినతి పత్రం ఇచ్చారు. మునుగోడులో డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాస గెలవాలని ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు.

భాజపాలో కొత్తగా చేరిన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. దీనిపై ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి నివేదించారు. గతంలో తెరాస నాయకులు డబ్బులను అంబులెన్స్‌, పోలీసు వాహనాల ద్వారా సరఫరా చేశారని.. ఆ వాహనాలను పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన​.. సప్లిమెంటరీ ఓటరు లిస్టు ఈ నెల 8వ తేదీన ఇస్తామని చెప్పినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు నల్లు ఇంద్రాసేనా రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్, ప్రకాష్ రెడ్డి, ఆంటోని రెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.