తెరాసలో అంతా దొంగలు, రౌడీలే ఉన్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి విమర్శించారు. కరోనా సమయంలో ఏ ఒక్క ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వం సాయం చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఆ పార్టీని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడించే సత్తా తమకే ఉందని ధీమా వ్యక్తంచేశారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో ప్రైవేటు ఉద్యోగుల, నిరుద్యోగుల సమ్మేళనంలో భాజపా నేత, శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు.
ఉద్యమకారులు కనిపించట్లేదు
ఉద్యోగులకు భరోసా లేకుండా పోయిందని రాకేష్ రెడ్డి అన్నారు. ఉద్యమాలు చేసిన నాయకులు తెరాసకు కనపడటం లేదని విమర్శించారు. దేశ ఖ్యాతి, సంస్కృతి, కాపాడడం కోసమే ఏర్పాటయిన పార్టీ భాజపా అని పేర్కొన్నారు. 30 ఏళ్లనాటి రామమందిరం వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించిన ఘనత తమదేనని కొనియాడారు. ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో నిరంకుశత్వానికి న్యాయవాదుల హత్యలే నిదర్శనం: కోదండరాం