దేశంలో ఆరు నెలల నుంచి కరోనా మహమ్మారి విజృభిస్తుంటే దానిని ఆపలేక... గణేష్ ఉత్సవాలను అడ్డుకోవడం సబబుకాదని భాజపా రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. విగ్రహ తయారీదారులను అమ్మకుండా ఆంక్షలు విధించడం సరైనది కాదని... గత సంవత్సరం నుంచి విగ్రహాలను తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు.
వినాయక మండపాలపై ఆధారపడి జీవిస్తున్న వాళ్లను పోలీసులతో బెదిరింపులు, బైండోవర్ చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. కరోనా ఆంక్షలను పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకునే విధంగా చూడాలని, అలాగే భక్తులు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని
సూచించారు.
ఇవీ చూడండి: శ్రావణంలో యాదాద్రికి తగ్గిన రాబడి.. రూ. కోటితో సరి!