నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీపీమండల్ 102 జయంతిని ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వెనుకబడిన కులాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఆయన సూచించిన 40 సిఫార్సులను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి: యాక్టివ్ కేసుల కన్నా 3 రెట్లు అధికంగా రికవరీలు