బతుకమ్మ వేడుకలు... ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో మహిళలు, యువతులు ఆడుతున్న సమయంలో... జోరుగా వర్షం కురిసింది. అయినా వానలోనూ బతుకమ్మ ఆడారు. పట్టణంలోని రామాలయం, బీట్ మార్కెట్, వీటి కాలనీ ప్రాంతాల్లో... బతుకమ్మలు పేర్చి ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో... భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వేడుకలకు ప్రధాన కేంద్రంగా నిలిచే రైతు బజార్తో పాటు వేంకటేశ్వర ఆలయం రహదారి, శంకర్ విలాస్ మీదుగా... ఊరేగింపు జరిగింది. అనంతరం చౌదరి చెరువులో... బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పదివేల మంది వరకు మహిళలు, యువతులు, బాలికలు... పాటలకు అనుగుణంగా పాదం కలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా... బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.
ఇవీచూడండి: బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న మంత్రులు