ETV Bharat / state

తండ్రీకుమారులిద్దరినీ గద్దె దించి సంప్రోక్షణ చేస్తాం: బండి సంజయ్​ - munugode bypoll latest news

Bandi Sanjay Counter to KTR: ఎమ్మెల్యేలు తప్పు చేయకపోతే ప్రగతిభవన్‌లో ఎందుకు పెట్టారని బండి సంజయ్ ప్రశ్నించారు. 16 మంది ఎమ్మెల్యేలు డ్రగ్స్‌ తీసుకుంటారని విమర్శించారు. భాజపా అధికారంలోకి రాగానే ఆ ఎమ్మెల్యేలతో సహా కేసీఆర్ కుటుంబసభ్యులకూ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు.

Bandi Sanjay Fires On TRS
Bandi Sanjay Fires On TRS
author img

By

Published : Oct 29, 2022, 7:01 PM IST

Updated : Oct 29, 2022, 8:13 PM IST

Bandi Sanjay Counter to KTR: మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తండ్రీకుమారులిద్దరినీ గద్దె దించి యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేస్తామని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ నోళ్లను యాసిడ్‌తో సంప్రోక్షణ చేయాలన్నారు. యాదాద్రి చాలా శక్తిమంతమైన ఆలయమని.. కేటీఆర్ నాస్తికుడు కాబట్టి దేవుడిని నమ్మడం లేదని మండిపడ్డారు. తండ్రీకుమారులు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మునుగోడులోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేలు తప్పు చేయకపోతే ప్రగతిభవన్‌లో ఎందుకు పెట్టారని బండి సంజయ్ ప్రశ్నించారు. 16 మంది ఎమ్మెల్యేలు డ్రగ్స్‌ తీసుకుంటారని ఆరోపించారు. భాజపా అధికారంలోకి రాగానే ఆ ఎమ్మెల్యేలతో సహా కేసీఆర్ కుటుంబసభ్యులకూ టెస్టులు చేస్తామని పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో మునుగోడు ప్రాంతానికి కేసీఆర్ అన్యాయం చేశారని బండి సంజయ్ విమర్శించారు.

తండ్రీకుమారులిద్దరినీ గద్దె దించి సంప్రోక్షణ చేస్తాం: బండి సంజయ్​

"రాజకీయ ఓనమాలు నేర్పించిన వారిని హైందవ సంప్రదాయం గురువులుగా భావిస్తారు. పాదరక్షలు కడుగుతాం మేము. మంచి వాళ్లవి కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలి అంటారు. యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేస్తామని అన్నారు ఎందుకు. కేసీఆర్, కేటీఆర్ నోళ్లను యాసిడ్‌తో సంప్రోక్షణ చేయాలి. యాదాద్రి ఆలయం చాలా పవర్‌ఫుల్‌ టెంపుల్‌. తప్పు చేసిన వాళ్లు తడి దుస్తులతో గుడికి వెళ్లరు. మేం తప్పు చేయలేదు కాబట్టే తడి దుస్తులతో వెళ్లి ప్రమాణం చేశా. కేటీఆర్ నాస్తికుడు కాబట్టి దేవుడిని నమ్మడం లేదు. మీరు గద్దె దిగిన తర్వాత తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం. ఎమ్మెల్యేలు తప్పు చేయకపోతే ప్రగతిభవన్‌లో ఎందుకు పెట్టారు. - బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి: 'మునుగోడు ఉపఎన్నిక ట్రైలర్‌ మాత్రమే.. కేసీఆర్‌ నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు'

జర్నలిస్టులకు 'క్యాష్‌ గిఫ్ట్‌లు'.. మరో వివాదంలో సీఎం.. దర్యాప్తునకు కాంగ్రెస్​ డిమాండ్​

Last Updated : Oct 29, 2022, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.