నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. అభ్యర్థులు మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభ్యర్థుల తరఫున ఆయా పార్టీ అగ్ర నాయకులు రంగంలోకి దిగారు.
ఈ నేపథ్యంలో భాజపా నాయకత్వం అగ్ర నాయకులను రంగంలోకి దించింది. అభ్యర్థి రవికుమార్ నాయక్ తరఫున సాగర్ హిల్ కాలనీలో మాజీ మంత్రి, సినీనటుడు బాబు మోహన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిల్ కాలనీలో 5 వార్డుల్లో రోడ్ షో చేశారు. రవికుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి: టీడీఆర్ ఒక మంచి ప్రయత్నం.. కేటీఆర్ ట్వీట్