ETV Bharat / state

Yadadri power plant: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్వాసితుల తరలింపు పూర్తి

దామచర్ల మండలం వీర్లపాలెం వద్ద రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అవసరమైన భూసేకరణ చేసి... నిర్వాసితులకు పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలను కేటాయించింది. కానీ మండల పరిధిలోని కపూర్ తండా, మోదుగుకుంట తండాలోని చాలామంది ప్రజలు ఇళ్లను ఖాళీ చేయకపోవడంతో... పోలీసులతో కలిసి పవర్​ప్లాంట్​ అధికారులు ఖాళీ చేయించారు.

Yadadri thermal power plant occupants
వేగంగా యాదాద్రి పవర్​ ప్లాంట్​ నిర్మాణం పనులు
author img

By

Published : Jun 22, 2021, 4:50 PM IST

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. భూసేకరణలో ఉన్నటువంటి కపూర్ తండా,మోదుగు కుంట తండాలోని గ్రామస్థులను పోలీసుల సహకారంతో పవర్​ప్లాంట్​ అధికారులు ఖాళీ చేయించారు. గతంలో దీని నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణ జరిపినప్పుడు అక్కడి ప్రజలను వేరేచోట తరలించేందుకు అని ఏర్పాట్లు చేసి... 2020 జూన్​లోనే వారికి పరిహారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు.

ఇళ్లను అద్దెకిస్తున్నారు...

అప్పుడే 15 రోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పగా... వారు సమయం కోరినట్లు చెప్పారు. ఇప్పటికే సంవత్సర కాలం గడిచినప్పటికీ కొంతమంది ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో పవర్ ప్లాంట్ అధికారులు, పోలీసుల సహాయంతో వారి ఇళ్లను ఖాళీ చేయించారు. గ్రామస్థులు కొంతమంది వేరే ప్రాంతాల్లో వుంటూ... పవర్ ప్లాంట్​లో పనిచేసే వారికి తమ ఇళ్లను అద్దెకు ఇస్తున్నారని అధికారులు ఆరోపించారు.

గడువు పెంచడం కుదరదు

విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అక్కడికి చేరుకుని పోలీసులతో మాట్లాడి... గ్రామస్థులకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇప్పటికీ చాలాసార్లు ఖాళీ చేయడానికి సమయం ఇచ్చినట్లు అధికారులు అన్నారు. ప్లాంట్ నిర్మాణంలో భాగంగా స్థలం అవసరం దృష్ట్యా... వెంటనే ఖాళీ చేయాలని గ్రామస్థులకు తెలిపారు. పోలీసుల సాయంతో అందరిని ఖాళీ చేయించారు.

ఇదీ చదవండి: MAVO LEADER: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.