ETV Bharat / state

బడుగు జీవులకు బండెడు అండ - atma nirbhar bharat package helps nalgonda district

కరోనా దెబ్బతో అస్తవ్యస్తంగా తయారైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ఉద్దీపన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రెండో రోజు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడుగు, బలహీన వర్గాలకు చేయూతనిచ్చేలా పలు ప్యాకేజీలను ప్రకటించారు. మొత్తం తొమ్మిది రంగాలకు గురువారం కేటాయింపులు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులు, వలస కూలీలు, స్వయం ఉపాధి, చిరు వ్యాపారులు, గ్రామీణ వికాసం, రేషన్‌కార్డుదారుల స్వావలంబనే లక్ష్యంగా నిధులు కేటాయించారు. వీటిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు లబ్ధిచేకూరే అంశాలు.

atma nirbhar bharat package helps nalgonda district to recover from corona crisis
బడుగు జీవులకు బండెడు అండ
author img

By

Published : May 15, 2020, 8:14 AM IST

వెనుకబడిన గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద నిధులు రానున్నాయి. అభివృద్ధి పరంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ, చందంపేట, కోదాడ, సాగర్‌ తదితర ప్రాంతాల్లో గ్రామాలు, తండాలు వెనుకబడి ఉన్నాయి. సమకూరే నిధులను ఆయా గ్రామాల్లో తాగునీరు, రహదారులు, భవన నిర్మాణాలు, పారిశుద్ధ్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు ఉపయోగించుకోవచ్చు. వీటిని తగిన రీతిలో ఉపయోగించుకుంటే గ్రామీణ వికాసం వెల్లివిరుస్తుంది. ముద్ర శిశు రుణాల కింద రూ.50 వేల రుణాలు తీసుకున్న చిరు వ్యాపారులకు రెండు శాతం వడ్డీని మాఫీ చేయనున్నారు.

ఉమ్మడి జిల్లాలో ముద్ర రుణాలు తీసుకున్నవారు: 1.60 లక్షల మంది

వర్షాకాలంలోనూ ఉపాధి

కరోనా దెబ్బతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద మరిన్ని రోజులు పనులు కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉపాధి పనులకు వెళ్లే వారికి రానున్న వర్షాకాలంలోనూ ఉపాధి దొరకనుంది. లాక్‌డౌన్‌ కంటే ముందు రూ.182 ఉన్న దినసరి కూలీని ఇటీవలే రూ.237కు పెంచారు. ఈమధ్యే ఉపాధి కూలీల సంఖ్య పెరిగింది.

కేంద్రం తీసుకున్న చర్యలవల్ల మరింతమంది జాబ్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ చర్యలతో ఈసారి వలసలు తగ్గవచ్చు. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు ఇంటిబాట పట్టారు. వీరంతా స్థానికంగా జాబ్‌కార్డుల ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది.

  • ఉమ్మడి జిల్లాలో ఉపాధి కూలీలు: 11.08 లక్షలు
  • వలస కూలీలు అధికంగా ఉన్న ప్రాంతాలు: మునుగోడు, నాంపల్లి, దేవరకొండ, పీఏపల్లి, పెద్దవూర, ఆలేరు, రాజపేట, బొమ్మలరామారం, చందంపేట
  • వలస వెళ్లే ప్రాంతాలు: హైదరాబాద్, ముంబయి, పుణె, సూరత్, ధారావి

రేషన్‌ రాని వారికీ లబ్ధి

ఉమ్మడి జిల్లాలో వివిధ కారణాలతో ఈ ఏడాది 13,019 మంది రేషన్‌ కార్డులను కోల్పోయారు. వీరిలో అత్యధికంగా 5,310 మంది నల్గొండ జిల్లా వాసులే. వీరందరికీ నెలనెల రేషన్‌ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారం ఆర్థికమంత్రి కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు.

ఇన్నాళ్లూ రేషన్‌ కోల్పోయిన 13 వేల మంది ఇకపై లబ్ధిపొందనున్నారు. అలాగే కార్డులేని వలస కూలీలు కూడా తమ కోటాను ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇందులో కేంద్రం తరఫున ప్రతి వ్యక్తికి ఉచితంగా 5 కిలోల బియ్యం, కిలో పప్పు ఇవ్వనున్నారు. వచ్చే ఆగస్టు నుంచి దేశంలో ఏ ప్రాంతంలోనైనా నిత్యావసర వస్తువులు పొందేలా విధివిధానాలు రూపొందించనున్నారు. వచ్చే మార్చికి ఈ ప్రక్రియను వందశాతం పూర్తి చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

రేషన్‌ కార్డు దారుల సంఖ్య

నల్గొండ జిల్లాలో..: 4.58 లక్షలు

సూర్యాపేట..: 3.16 లక్షలు

యాదాద్రి..: 2.08 లక్షలు

కార్డులు కోల్పోయినవారు: 13,019

ఒక్కో వలస కూలీకి ఇచ్చే వస్తువులు: 5 కిలోల బియ్యం, కిలో పప్పు

గ్రామీణ వికాసానికి పెద్దపీట

కరోనా దెబ్బతో నష్టపోయిన గ్రామీణ బ్యాంకులకు ఊపిరులూదేలా భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గ్రామీణ, సహకార బ్యాంకులకు నాబార్డు రుణాల ద్వారా నిధులు సమకూరుస్తారు. వీటిలో ఎక్కువమంది ఖాతాదారులు రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు, చిరు వ్యాపారులు, చేనేత కార్మికులు, స్వయం సంవృద్ధి సంఘాల వారే. బుధవారం ప్రకటించిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వీటి ద్వారానే రుణాలు ఇప్పించనున్నారు.

ఉమ్మడి జిల్లాలో గ్రామీణ, సహకార బ్యాంకులు: 656

రైతులకు వెన్నుదన్నుగా...

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కిసాన్‌ కార్డులున్న 4 లక్షల మంది రైతులు తీసుకున్న రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం విధించారు. తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మార్చి ఒకటో తేదీ నుంచి మే 31 వరకు కట్టిన వడ్డీని రాయితీ రూపంలో తిరిగి చెల్లించనున్నారు.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల్లేని మత్స్యకారులు, పశుపోషకులకు రుణాలు ఇచ్చి ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఫలితంగా జిల్లాలోని 1653 గ్రామాల్లో ఉంటున్న 60 శాతం మంది ఈ రుణాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధిపొందనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను గట్టెక్కించడానికి ఇవి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో రైతులు: సుమారు 10 లక్షలు

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులున్నవారు: సుమారు 4 లక్షలు

లబ్ధిపొందనున్న మత్స్యకారులు, పశుపోషకుల శాతం: 60

ఉద్దీపన ప్యాకేజీ బాగుంది

సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమల నిర్వచనాన్ని మార్చి తయారీ., సేవల రంగాలను కలపడం హర్షణీయం. చిన్న వ్యాపారులకు హామీలేని రూ.3 లక్షల కోట్ల రుణాలను ప్రకటించడంతో కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుంది. వ్యవసాయం, చిరు వ్యాపారులు, వలస కూలీలకు ప్యాకేజీ ప్రకటించడం మంచి పరిణామం. దేశవ్యాప్తంగా వన్‌ నేషన్, వన్‌ రేషన్‌ విధానం ప్రవేశపెట్టనుండడం గొప్ప విషయం. తద్వారా పేదలు ఎక్కడ ఉన్నా రేషన్‌ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించనుండడం మంచి నిర్ణయం.

- సుధారాణి, ఎకనామిక్స్‌ అధ్యాపకురాలు, నల్గొండ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.