ETV Bharat / state

అనువు కాకున్నా అంకూర్‌ పూజకే జై... - Ankur Puja Seeds

అంకూర్‌ పూజ.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న సన్నరకాల వరి ధాన్యం ఇది. దీని సాగుకు ఏ రాష్ట్ర నేలలు అనుకూలమో ఆ సంస్థకు చెందిన విత్తనాల సంచిపైనే రాసి ఉంది. ఇందులో తెలంగాణ లేదు. అయినా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్‌పీ)ల కింద గత నాలుగేళ్లుగా రైతులు ఈ రకం ధాన్యాన్నే ఎక్కువగా సాగు చేస్తున్నారు.

Ankurja Puja is the thinnest rice grain currently cultivated in the largest area of the telangana state
అనువు కాకున్నా అంకూర్‌ పూజకే జై...
author img

By

Published : Nov 13, 2020, 7:20 AM IST

సాధారణ బీపీటీ, జైశ్రీరాం లాంటి సన్నరకాలతో పోలిస్తే అంకూర్‌ పూజ పంట తక్కువ దిగుబడితో పాటు ఎక్కువగా దోమపోటు, అగ్గితెగుళ్లకు గురవుతోంది. ఏ రకం నేలల్లో ఏ రకం వరి ధాన్యాన్ని సాగుచేయాలో ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు చేయాల్సిన వ్యవసాయ అధికారులు ఈ రకం ధాన్యం సాగు విషయంలో మాత్రం ఎక్కడాలేని శ్రద్ధ చూపుతున్నారు. ఇక్కడి నేలలు ఈ రకం ధాన్యం సాగుకు అనుకూలంగా లేకున్నా ఎందుకు ప్రోత్సహిస్తున్నారనే విషయంలో మాత్రం అధికారులు స్పందించడం లేదు.

ఆంధ్ర ప్రాంతం నుంచి రాక

అంకూర్‌ పూజ విత్తనాలను సాగర్‌ కుడి కాల్వ పరిధిలోని గుంటూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాల్లో రైతులు ఎక్కువగా వాడేవారు. నల్గొండ జిల్లా సరిహద్దు అయిన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని ఓ ఏజెంటు నాలుగేళ్లుగా పెద్ద మొత్తంలో ఈ రకం విత్తనాలను మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ లాంటి ఆయకట్టు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ విత్తనాలను ప్రోత్సహిస్తే వ్యవసాయ అధికారులకు పెద్ద మొత్తంలో కమీషన్లు ముట్టజెప్పడంతో వారు వీటినే సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే వానాకాలం సీజన్‌లో దాదాపు 5 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ రకం సన్నాలను సాగు చేశారు. ఈ ఏడాది కోత సమయానికి వర్షాలు పడటంతో దిగుబడి తగ్గడంతో పాటు ఎక్కువగా దోమపోటు, అగ్గితెగుళ్లతో నష్టపోయారు. మిగిలిన సన్నరకాలతో పోలిస్తే ఈ రకం పంటకు పురుగు మందులు సైతం ఎక్కువగా పిచికారీ చేయాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. సాధారణంగా మిల్లర్లు 20 నుంచి 22 శాతం వరకు తేమ ఉన్న సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఈ తేమ శాతం ఉంటేనే మిల్లింగ్‌కు అనుకూలమని అంతకంటే తక్కువ ఉంటే ధాన్యం బాయిల్డ్‌ చేసేటపుడు విరిగిపోతుందనేది మిల్లర్ల వాదన. కాగా ఆ తేమ శాతంతో మిగిలిన సన్నాలు మూడు నాలుగు రోజులు నిల్వ చేసుకున్నా మార్పు ఉండకపోగా ఈ రకం ధాన్యం మాత్రం మూడు నాలుగు రోజులు నిల్వ చేసుకుంటేనే కింద ఉన్న ధాన్యం బూజు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దోమపోటు, అగ్గితెగుళ్లే ఎక్కువ

- ధనావత్‌ సైదానాయక్‌, రైతు, ట్యాంక్‌ తండా, మిర్యాలగూడ

వ్యవసాయ అధికారులు చెబితే పూజ రకం విత్తనాలను సాగు చేశాం. గతంలో బీపీటీ వేస్తే ఎక్కువ మందులు పిచికారి చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ విత్తనాలు వేసినప్పటి నుంచి దోమపోటు, అగ్గితెగుళ్లు సోకి దిగుబడులు తక్కువ వస్తున్నాయి. ఈ సీజన్‌లో అయితే పెట్టుబడి కూడా రాలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.