నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిచిన వార్డులకు మున్సిపల్ నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
అభివృద్ధి నిధుల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ వార్డుల పట్ల అధికార పార్టీ వివక్ష చూపుతుందని వారు ఆరోపించారు. ఏకపక్షంగా రూపొందించిన కౌన్సిల్ ఎజెండాను మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలు ర్యాలీగా వచ్చి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.
వారికి 20, మాకు పదా..?
మిర్యాలగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 8 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు అయ్యాయని.. ఎమ్మెల్యే, ఛైర్మన్లు నిధుల కేటాయింపులో వివక్షకు తెరలేపారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా విడుదలైన నిధులను సమానంగా పంపిణీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ వార్డులకు రూ. 10 లక్షలు, అధికార పార్టీ వార్డులకు రూ. 20 లక్షలు కేటాయించారని ఆరోపించారు.
ఇదీ చూడండి: సీరం టీకా వినియోగంపై డీసీజీఐ నిర్ణయం అప్పుడేనా?