లేని అధికారంతో గుర్తు మార్చి విధి నిర్వహణలో వైఫల్యం చెందినందుకు మునుగోడు మాజీ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్నాథరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. యాదాద్రికి 300 మందిని తీసుకెళ్లి ప్రమాణం చేయించిన వ్యవహరంలో వచ్చిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తెరాసపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దానికయ్యే ఖర్చును తెరాస అభ్యర్థి ఖాతాలో వేయాలని ఆదేశించింది. ఈవీఎం బ్యాలెట్‌లో బోటుకు బదులు మరో గుర్తు ముద్రించినందుకు చౌటుప్పల్ ఎమ్మార్వోపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇవీ చదవండి: