నల్గొండ జిల్లా హాలియాలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్లో నోముల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య కుటుంబసభ్యుల సహాకారంతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అపోలో ఫార్మా కంపెనీ ఉద్యోగులు అర్హులను ఎంపిక చేసుకున్నారు. కార్యక్రమంలో నోముల నర్శింహయ్య చిత్రపటానికి.. ఉప ఎన్నికల తెరాస అనుముల మండల ఇంఛార్జి, ఎమ్మెల్యే కోనేరు కొనప్ప, ఫౌండేషన్ సభ్యులు పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి: చిత్తడి అవుతున్న ఇత్తడి తయారీదారుల బతుకులు