ETV Bharat / state

కోమటిరెడ్డి పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తత - నల్లొండ జిల్లాలో ఘర్షణ

Clash between BRS and Congress in Nalgonda district: నల్గొండ జిల్లాలోని ఇటుకులపాడులో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బీఆర్ఎస్ పాలనలో రోడ్లు ఘోరంగా ఉన్నాయని ఎంపీ వెంకట్‌రెడ్డి విమర్శలు చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దైవకార్యానికి వచ్చి రాజకీయాలు మాట్లాడొద్దని బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం చెప్పారు.

Clash between BRS and Congress
Clash between BRS and Congress
author img

By

Published : Feb 16, 2023, 9:23 PM IST

కోమటిరెడ్డి పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తత

Clash between BRS and Congress in Nalgonda district: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకులపాడు గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన, నూతన శివాలయం గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి గాను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు శివాలయంలో ఎంపీ వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Clash between BRS and Congress: అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాదారం నుంచి ఇటుకులపాడు రోడ్డు దారుణంగా ఉందన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటూ విమర్శించారు. కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి రోడ్డు వెంటనే వేపిస్తానని చెప్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. వెంకట్​రెడ్డి మాటలకు.. దైవకార్యానికి వచ్చి రాజకీయాలు మాట్లాడొద్దని బీఆర్ఎస్ శ్రేణుల అభ్యంతరం చెప్పారు.

Clash of Congress BRS Parties: అక్కడున్న వెంకట్​రెడ్డితో బీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పార్టీల ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడి నుండి ఎంపీ కోమటిరెడ్డి బయలుదేరి వెళ్లిపోయారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో నల్గొండ జిల్లా డీసీఎంఎస్ ఒట్టే జానయ్య యాదవ్ అక్కడే ఉన్నారు.

ఉన్నట్టుండి ఒక్కసారిగా ఘర్షణ జరగడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. దీంతో గ్రామంలో పూర్తిగా ఘర్షణ వాతావరణం కనిపించింది. గ్రామస్థులు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న నల్గొండ పోలీసులు ఘర్షణ స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఇరువర్గాల పార్టీల వారికి సర్దిచెప్పడంతో గొడవ కాస్త సద్దుమణిగింది.

ఎన్నికలు సందడి మొదలు కాకపోయినా.. గ్రామాల్లో రాజకీయ వేడి మాత్రం మొదలైందని ఈ ఘటనతో తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో నేతల పర్యటనలు మొదలు కావడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఘర్షణలు జరుగుతున్నాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.