ETV Bharat / state

ప్రమాదం ఆ ఇంట నింపింది పెను విషాదం - తెలంగాణ నేర వార్తలు

నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్​ మల్లేశం, అతడి తల్లి పెద్దమ్మ, భార్య చంద్ర కళ ప్రాణాలు కోల్పోయారు. మల్లేశం దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి వద్ద వారి రాక కోసం ఎదురు చూస్తున్న వారి పిల్లలు, తండ్రి పరిస్థితి ఇలా ఉంది.

బలిగొన్న మృత్యువు... అనాథలైన బిడ్డలు
బలిగొన్న మృత్యువు... అనాథలైన బిడ్డలు
author img

By

Published : Jan 22, 2021, 8:33 AM IST

అన్నయ్యా అమ్మ వాళ్లు ఇంకా రాలేదు..! బాగా చీకటి పడిపోతోంది. ఊరోళ్లంతా ఏడ్చుకుంటూ ఎక్కడికో వెళ్లిపోతున్నారు. తాతయ్య కూడా ఏడుస్తున్నాడు నాకేదో భయంగా ఉంది.. ఏడుస్తున్న తమ్ముడికి ఏమని చెబుతాడు తనకంటే ఓ రెండేళ్లు పెద్దవాడైన అన్న. తానూ నిండా పదేళ్లైనా నిండని పిల్లాడే కదా! పొద్దున్ననగా పనికెళ్లిన అమ్మనాన్నలు ఎందుకు రాలేదో తెలీదు. అందరూ ఎందుకు ఏడుస్తున్నరో ఎవరూ చెప్పడం లేదు. దిగాలుపడిపోతున్న తమ్ముడిని సమదాయించడం ఆ అన్న వల్ల కావడం లేదు.

ఆకలి వేస్తున్నా... లోలోపల తెలియని ఆందోళన కప్పిపుచ్చేస్తోంది. ఇంకా తమ వాళ్లు రాలేదనుకుంటున్నారే తప్ప ఎప్పటికీ రారని తెలియలేదు. రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన వారి కోసం ఇంటి దగ్గర దీనంగా ఎదురుచూస్తున్న వారి చూపులను... నెత్తుటి మడుగులో మాంసపు ముద్దగా మారిన తమ వాళ్లు దేహాలు కనిపించకుండా కటిక చీకట్లు అలుముకున్నాయి. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, తండ్రి, నానమ్మను కోల్పోయిన చిన్నారుల దీన పరిస్థితి ఇది.

ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ మల్లేశం, అతని భార్య చంద్రకళ, తల్లి పెద్దమ్మ ఘటనాస్థలిలోనే మృతి చెందారు. ఆ కుటుంబంలో మిగిలిన పెద్దదిక్కు వారి తాత ఒక్కడే. అమ్మ, నాన్న, నాన్నమ్మ ఇక లేరని.. ఎప్పటకీ రారని.. ఆ చిన్నారులకు చెప్పలేక ఆ తాత దు:ఖ సాగరంలో మునిగిపోయాడు. ఎవరెవరో వచ్చి ఓదార్చుతున్నారు. ఏవేవో హామీలు ఇస్తున్నారు. చుట్టూ మృత్యువు కమ్మిన చీకట్లలో దారి కనబడక నిల్చున్న చోటే కూర్చుండిపోయిన ఆ తాతకు.. కళ్లెదుట భార్య, కొడుకు, కోడలు మృతదేహాలు.. మదిలో ఇంటి వద్ద ఎదురు చూస్తున్న చిన్నారులే కదులుతున్నారు.

ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన కన్నీళ్లతో.. హృదయ వేదనను అణుచుకుంటూ దిగాలుగా కూర్చుండిపోయాడు. తాతయ్య వెళ్లి అమ్మ వాళ్లను తీసుకొస్తాడని ఎదురు చూస్తున్న ఆ చిన్నారులకు వారి శవాలను తీసుకెళ్లి చూపించి.. వారినెల సముదాయించగలడు. వారి లేని లోటును ఎలా పూడ్చగలడు.

ఇదీ చూడండి: రెప్పపాటులో ఛిద్రమైన బతుకులు... రోడ్డు ప్రమాదంలో 9 మంది కూలీలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.