నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల వల్ల 20 క్రస్ట్ గేట్లు ఎత్తి 4లక్షల 25 వేల 748 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. 20 క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 588.20 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 306.10 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువ సాగుకు, ఏఎంఆర్పీకి, తాగునీటి కోసం, ప్రధాన విద్యుదుత్పత్తి ద్వారా మొత్తం కలిపి 4లక్షల 49వేల 734 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: శాంతించిన గోదారమ్మ... 52.5 అడుగులకు చేరిన నీటిమట్టం