సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం భీమ్లా తండాలో వైద్యం అందక 18 నెలల బాలుడు మృతి చెందాడు. మంగళవారం రాత్రి బాలుడికి కడుపు నొప్పి వచ్చింది. కోదాడలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు తిరిగినా డాక్టర్లు అందుబాటులో లేరు. చివరకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడా వైద్యుడు అందుబాటులో లేనందున బాబు మరణించాడు.
ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే అందుబాటులో లేకపోతే ఎలా అంటూ బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసరమైన కేసుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక