నాగార్జున సాగర్ జలాశయానికి వరద భారీగా వస్తుండటంతో 16 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ దిగువన ఉన్న ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 29 వేల క్యూసెక్కుల నీరు పులిచింతల వైపు విడుదల చేశారు. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు కలిపి సాగు నీరు 10 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
590కి గానూ 589 అడుగుల నీటిమట్టం..
సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 కాగా ప్రస్తుతం 589 అడగులకు నీటిమట్టం చేరింది. 312.04 టీఎంసీల నిల్వ సామర్ధ్యం ఉండగా ప్రస్తుతం 309.05 టీఎంసీల వద్ద నీటి నిల్వ ఉంది. పైనుంచి వరద ప్రవాహాన్ని బట్టి నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి నేటి వరకు సాగర్ జలాశయం నుంచి వరద దిగువకు కొనసాగుతోందన్నారు.